‘బ్రూస్‌లీ’లో చిరు రోల్.. 150వ సినిమాకు టీజర్!

‘బ్రూస్‌లీ’లో చిరు రోల్.. 150వ సినిమాకు టీజర్!

Published on Oct 3, 2015 1:00 PM IST

chiru
‘బ్రూస్ లీ’.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్‌లో భారీ ఎత్తున నిర్మితమవుతోన్న సినిమా. తెలుగు సినిమా మార్కెట్ బాగా పెరిగిన నేపథ్యంలో భారీ అంచనాలతో వస్తోన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులే కాక ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి ఓ గెస్ట్ రోల్ చేయడం సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా, అక్టోబర్ 16న దసరా సీజన్‌కు విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక నిన్న సాయంత్రం నిర్వహించిన బ్రూస్ లీ ఆడియో ఆవిష్కరణ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ బ్రూస్ లీలో గెస్ట్ రోల్ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

‘బ్రూస్ లీ’ సినిమా దర్శకుడైన శ్రీనువైట్ల, రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్‌లు ఈ సినిమాలో తన కోసం ఓ మంచి గెస్ట్ రోల్‌ను రూపొందించారని చిరంజీవి తెలిపారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భోజనం అయ్యాక తీసుకునే ఐస్‌క్రీమ్‌లా బ్రూస్‌లీలో తన పాత్ర ఉంటుందని, ఈ సినిమాలో తన పాత్ర 150వ సినిమాకు టీజర్ లాంటిదని చెప్పి కోన వెంకట్ తనను ఒప్పించారని చిరంజీవి తెలిపారు. చాలాకాలం తర్వాత కెమెరాను ఫేస్ చేయడంతో ఎలా ఉంటుందో అన్న ఉత్సుకత తనకూ ఉండిందని, మానిటర్‌లో సీన్ చూసుకున్నాక ‘పాస్ అయిపోయాం’ అనే ఫీలింగ్ కలిగిందని చిరు ఈ సందర్భంగా మాట్లాడడం ఆసక్తికరంగా కనిపించింది. ఇక తాను చేయబోయే 150వ సినిమాకు సంబంధించిన వివరాలు మరో పది రోజుల్లో తెలియజేస్తానని చిరంజీవి స్పష్టం చేశారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు