వెంకీ మామ కోసం చిరు రంగంలోకి దిగారు

వెంకీ మామ కోసం చిరు రంగంలోకి దిగారు

Published on Dec 19, 2019 12:02 PM IST

Chiranjeevi

టాలీవుడ్ మామ అల్లుళ్ళు విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య మల్టీ స్టారర్ వెంకీ మామ గత వారం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు బాబీ ఫన్ ఎలిమెంట్స్ తో కూడిన ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీయడం జరిగింది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన వెంకీ మామ చిత్రం పై ప్రసంశలు కురిపిస్తూ మెగాస్టార్ ఓ వీడియో చేశారు. వెంకీ మామ చిత్రం చూసిన మెగాస్టార్ ఆద్యంతం ఎంజాయ్ చేశారట. ముఖ్యంగా వెంకటేష్ తన మార్కు కామెడీ టైమింగ్, యాక్షన్ అండ్ ఎమోషన్స్ కురిపించాడన్నారు. అలాగే నాగ చైతన్య మెట్యూర్డ్ యాక్టింగ్ తో మూవీ విజయంలో కీలక పాత్ర పోషించారు అన్నారు.

దర్శకుడు బేబీ టేకింగ్, కథకు ఇచ్చిన ట్రీట్మెంట్ స్క్రీన్ ప్లే అద్భుతం అని ఆయన పొగిడారు. కాబట్టి వెంకీ మామ సినిమా మీకు బాగా నచ్చుతుంది వెళ్లి చూడండి అని తన అభిమానులకు చిరు పిలుపునిచ్చారు . వెంకీ మామ మూవీ రేపటి నుండి కొత్త సినిమాల నుండి తీవ్ర పోటీ ఎదుర్కొననుంది. దీనితో వెంకీ మామ చిత్రానికి మద్దతుగా చిరు ఈ వీడియో చేశారు. ఈ మూవీలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించగా థమన్ సంగీతం అందించారు.

తాజా వార్తలు