జర్నలిస్ట్‌లకు చిరంజీవి సపోర్ట్

Published on Jun 12, 2019 11:13 pm IST

ఎప్పటికప్పుడు పలు సామాజిక కార్యక్రమాలకు, పరిశ్రమలోని వ్యక్తులకు, పలు అసోసియేషన్లకు తన వంతు సహకారం అందిస్తుంటారు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవలే దర్శకుల సంఘానికి 10 లక్షల విరాళం ఇచ్చిన ఆయన మరోసారి తన ఉదారత్వాన్ని చాటుకున్నారు. ఫిల్మ్ జర్నలిస్ట్‌ల సంక్షేమం కోసం ఫిల్మ్స్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ చేస్తున్న సేవలను గుర్తించిన ఆయన తనవంతుగా ధనసహాయాన్ని అందించారు.

అంతేకాదు భవిష్యత్తులో అసోసియేషన్‌లోని సభ్యుల శ్రేయస్సు కొరకు ఎలాంటి సహకారం అందించడానికైనా సిద్ధంగా ఉంటాయని అన్నారు. మెగాస్టార్ అందించిన సహకారం పట్ల ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చిరు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’లో నటిస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత సమాచారం :

More