కోడలు ఉపాసన కోసం ఫోటోగ్రాఫర్ గా మారిన చిరు.

Published on Sep 23, 2019 12:47 pm IST

నిన్న జరిగిన సైరా ప్రీ రిలీజ్ వేడుకలో మెగా కోడలు చరణ్ సతీమణి ఉపాసన హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని ఫోటోలకు పోజివ్వడం జరిగింది. ఐతే వాటిలో ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ఆ ఫోటోకున్న ప్రత్యేకత ఏమిటంటే..,ఆ ఫోటోని స్వయంగా ఉపాసన మామగారైన చిరంజీవి తీశారు. దీనితో మెగా అభిమానులు చిరులోని మరో యాంగిల్ చూసి మురిసిపోతున్నారు.

ఉపాసన వెనుక ఒక అద్దం ఉండటంతో ఆమెను ఫోటో తీస్తున్న చిరంజీవి కూడా ఆ ఫొటోలో క్యాప్చర్ కావడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. బహుముఖ ప్రజ్ఞ కలిగిన ఉపాసన హెల్త్, ఫిట్నెస్ మరియు లైఫ్ స్టైల్ పై ఓ మేగజైన్ నడపడంతో పాటు, గతంలో చిరు ఫోటోషూట్ చేసి ఆ జర్నల్ కవర్ పేజీ పై ఆయన చిత్రాన్ని ముద్రించి విడుదల చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :

X
More