తెలంగాణ ప్రజలకు మెగాస్టార్‌ బోనాల శుభాకాంక్షలు !

Published on Jul 11, 2021 2:56 pm IST

ఆషాఢమాసం బోనాల ఉత్సవాల సందడిలో ఉన్న తెలంగాణ ప్రజలకు మెగాస్టార్‌ చిరంజీవి శుభాకాంక్షలు తెలుపుతూ తాజాగా ఒక ట్వీట్ చేశారు. ‘బోనాలపండుగ ప్రారంభం సందర్భంగా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు. తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు. ‘వర్షాలు బాగా కురవాలని, పాడిపంటలు వృద్ధి చెందాలని, అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆషాఢ మాసం అంతా జరిగే ఈ ఉత్సవాలను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి పోస్ట్ చేశారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా నుండి నిన్న చరణ్ పోస్టర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ‘రీసెంట్‌గా ‘ఆచార్య’ ఫైనల్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ ను స్టార్ట్‌ చేశారు. రామ్‌ చరణ్‌ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ చిత్రీకరణతో షూటింగ్‌ పూర్తవుతుంది.

ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :