లయన్స్ ఇన్ ట్విట్టర్ అట..!

Published on Mar 26, 2020 3:02 pm IST

మెగాస్టార్ చిరంజీవి నిన్న ట్విట్టర్ ఎంట్రీ ఇవ్వడంతో పాటు వరుస ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. టాలీవుడ్ చిరు ట్విట్టర్ ఎంట్రీకి గ్రాండ్ వెల్కమ్ ఇవ్వడం జరిగింది. ఇక చిరును ఫాలో అవుతూ రామ్ చరణ్ కూడా తన ట్విట్టర్ అకౌంట్ ని పునరుద్ధరించారు. ఆల్ వేస్ రామ్ చరణ్ పేరుతో ఆయన ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించడం జరిగింది. కాగా మెగాస్టార్ తన కొడుకు రామ్ చరణ్ ట్విట్టర్ ఎంట్రీకి స్వాగతం పలకడంతో పాటు, సింహాన్ని అనుసరిస్తున్న సింహపు పిల్ల అని ట్వీట్ చేశారు.దీనికి స్పందనగా రామ్ చరణ్ థాంక్స్ డాడీ రిప్లై ఇచ్చారు.

ఇక దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తున్న చిరు 152వ చిత్రంలో చరణ్ సైతం ఓ కీలక రోల్ చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More