చిరంజీవి కొత్త నివాస భవనం.. ఎన్నెన్నో భారీ హంగులు

Published on Nov 22, 2019 2:00 am IST

మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో కొత్త నివాస భవనాన్ని నిర్మించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ భావన నిర్మాణం పూర్తికావొస్తోంది. చిరు ఎంతో ఇష్టపడి నిర్మించుకుంటున్న ఈ నివాసంలో ఎన్నో భారీ హంగులు ఉన్నాయని ఆ భవంతికి డిజైన్ ప్లానింగ్ చేసిన ప్రముఖ ఇంటీరియర్, ఆర్కిటెక్చర్ సంస్థ తహిలియానీ హోమ్స్ నిర్వాహకుల్లో ఒకరైన జహన్ తహిలియానీ అంటున్నారు.

సుమారు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఇంట్లో అనేక ఖరీదైన విశేషాలు ఉన్నాయట. వాటిలో ప్రధానంగా జేడ్ రూమ్ అని ఒకటి ఉందట. అంటే ఆభరణాల తయారీలో వాడే పచ్చరాళ్లను ఉపయోగించి ఆ పెద్ద గదిని రూపొందించారట. అంతేకాదు ఇంట్లో ప్రత్యేకంగా పెద్ద పూజగదిని నిర్మించారట. ఇంటి నిర్మాణంలో ఖరీదైన మార్బుల్స్, శాండ్లైర్స్, కార్పెట్స్ వాడారట. భారతీయ, హైదరాబాద్ సంస్కృతి ఉట్టిపడేలా ఇంటి నిర్మాణం ఉంటుందని జహన్ తహిలియానీ చెబుతున్నారు.

ఇంటి నిర్మాణం, ఇంటీరియర్ డిజైనింగ్ విషయంలో రామ్ చరణ్, ఉపాసన చాలా శ్రద్ద చూపి అన్ని పనుల్ని దగ్గరుండి చూసుకున్నారని, ఇళ్లు చాలా గొప్పగా వచ్చిందని కూడా తెలిపారు. ఈ ఇంటి ప్రారంభోత్సవానికి టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హజరుకానున్నారట.

సంబంధిత సమాచారం :

More