టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సందడి మొదలైపోయింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu). సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ అప్డేట్ ని రివీల్ చేశారు.
జనవరి 4న ట్రైలర్ విడుదల!
మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 4, 2026న ఘనంగా విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. ఇక ట్రైలర్ వస్తే ఆ ఆసక్తి మరో స్థాయికి వెళ్లడం ఖాయం అనే చెప్పొచ్చు.
ట్రైలర్ లాంచ్ వేదిక ఇదేనా?
సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ట్రైలర్ విడుదల వేడుకను తిరుపతిలో నిర్వహించే అవకాశం ఉంది అని వినిపిస్తుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు:
ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారు. అలాగే క్యాథరిన్ థ్రెసా, సునీల్, వీటీవీ గణేష్, రేవంత్, హర్ష వర్ధన్, సచిన్ ఖేడేకర్, అభినవ్ గోమఠం వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని, జనవరి 12, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


