మెగా హీరోలలో వారిద్దరికి మహేష్ చాలా ప్రత్యేకం.

మెగా హీరోలలో వారిద్దరికి మహేష్ చాలా ప్రత్యేకం.

Published on Apr 5, 2020 2:26 PM IST

మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ మనసు దోచేశాడు. మహేష్ గురించిన ఆయన చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ లో చిరుపట్ల మరింత గౌరవం కలిగేలే చేశాయి. కరోనా వైరస్ కారణంగా క్వారంటైన్ లో ఉన్న చిరంజీవి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మహేష్ గురించి మాట్లాడుతూ తను నా కొడుకుతో సమానం అన్నారు. అలాగే మహేష్ తో నటించడానికి నేనెప్పుడూ సిద్దమే అన్నారు. అలాగే మహేష్ తో నటించడం నాకు చాలా ఆనందం కలిగించే అంశం అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరై, చిరంజీవి తన ప్రత్యేకత చాటుకున్నారు. అలాగే మహేష్ చరణ్ కి కూడా మంచి మిత్రుడు. ఇండస్ట్రీలో మహేష్ కలిసే కొద్దిమంది మిత్రులలో చరణ్ ఒకరు. అలాగే ఓ ఇంటర్వ్యూ లో మహేష్ ని ఓ లాంగ్ ట్రిప్ కి వెళ్లాలంటే ఎవరిని తోడుగా తీసుకెళ్తారు అని అడుగగా ఆయన చరణ్, ఎన్టీఆర్ పేర్లను చెప్పారు. దీనితో మహేష్, మెగా ఫ్యామిలీలో చిరంజీవి, చరణ్ లకు చాల ఆప్తుడని అర్థం అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు