“శ్రీదేవి శోభన్ బాబు” ట్రైలర్ ను విడుదల చేయనున్న చిరు, చరణ్

Published on Apr 22, 2022 11:46 am IST

చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరగనున్న సంగతి అందరికీ తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 29, 2022న థియేటర్లలో విడుదల కానుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీదేవి శోభన్ బాబు థియేట్రికల్ ట్రైలర్‌ను చిరు, చరణ్ లాంచ్ చేస్తారని సమాచారం.

గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ మరియు 96 ఫేమ్ గౌరీ జి కిషన్ ప్రధాన నటులుగా నటించారు. ఈ చిత్రానికి కమ్రాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :