చిరు-కొరటాల సినిమాకు ఆర్ఆర్ఆర్ తలనొప్పి.. నిజమేనా..!

Published on Feb 22, 2020 8:28 pm IST

సైరా నరసింహరెడ్డితో మంచి బిగ్గెస్ట్ హిట్ కొట్టిన మెగస్టార్ చిరంజీవి ఆ తరువాత తన తదుపరి సినిమాను కొరటాల శివతో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే చాలా రోజుల తరువాత ఈ సినిమాలో చిరు మంచి మాస్ రోల్‌లో కనిపించబోతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో కీలక పాత్రలో చిరు తనయుడు రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాను ఈ ఏడాది ఆగష్ట్ 15న రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించినా, తాజా పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా రిలీజ్ ఆలస్యం కానుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి అసలు కారణం ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడంతో కొరటాల సినిమాకు సరిగ్గా హాజరు కాలేకపోతున్నారని, ఇందులో చరణ్‌ది ముఖ్యమైన పాత్ర కావడంతో సినిమా రిలీజ్ కాస్త ఆలస్యం కానుందని టాక్. అయితే దీనిపై చిత్ర బృందం మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

సంబంధిత సమాచారం :

X
More