మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు ని విశాఖపట్నం లో నిన్న సన్మానించిచారు. ఈ సీనియర్ దర్శకుడికి ‘విశ్వ విఖ్యాత దర్శకబ్రహ్మ’ అనే బిరుదుని ప్రధానం చేసారు మరియు స్వర్ణ కంకణం తొడిగారు. టి. సుబ్బిరామిరెడ్డి కళా పీటం మహా శివరాత్రి ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు.
రాఘవేంద్ర రావు ని ఎంతో సేపు పొగిడిన చిరంజీవి ఆయనతో కలసి ఎన్నో చిత్రాల్లో పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. చిరంజీవి రాఘవేంద్ర రావు 15 బ్లాక్బస్టర్ చిత్రాలకు కలసి పనిచేసారు. రాఘవేంద్ర రావు చిరంజీవి 150 వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని వదంతులు రావడంతో ఈ సన్మానానికి ప్రాముఖ్యత వచ్చింది.
ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు మోహన్ బాబు జయసుధ జయప్రద తో పాటు కొంతమంది రాజకీయనాయకులు హాజరు అయ్యారు.


