చిరు-కొరటాల మూవీ విడుదల అప్పుడేనట..!

Published on Feb 25, 2020 8:55 am IST

మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. కమర్షియల్ అంశాలు కలిగిన సోషల్ మెస్సేజ్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్రం ఆగస్టులో విడుదుల కానున్నట్లు తెలుస్తుంది. నిర్మాతలు ఆగస్టు లో ఈ చిత్రం విడుదల చేయాలని ప్రణాళికలు వేస్తున్నారట. దీనిపై స్పష్టమైన ప్రకటన లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తుంది.

కాగా ఇటీవల చిరు లుక్ లీక్ కాగా ఆయన మాస్ లుక్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. ఈ చిత్రంలో చిరు సరసన నటిస్తున్న హీరోయిన్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా కాలం తరువాత మెలోడీ బ్రహ్మ మణిశర్మ చిరంజీవి చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :