ఆ విషయంలో జగన్ భేష్ అంటున్న చిరంజీవి

Published on Dec 13, 2019 10:38 am IST

మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై యస్ జగన్ ని అభినందించారు. దానికి కారణం జగన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దిశా చట్టం. ఆడవారి మాన, ప్రాణాలకు రక్షణ కరువవుతున్న నేపథ్యంలో వీటిని అరికట్టే దిశగా ఆయన అడుగులు వేశారు. క్రిమినల్ చట్టంలో కొన్ని మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ దిశా చట్టాన్ని ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానిని ఆమోదింపజేశాడు. దీని ప్రకారం ఆడవాళ్లు, చిన్నపిల్లల పై మానభంగం హత్య వంటి విషయాలలో రెండ్ హ్యాండెడ్ గా దొరికినా, ఆధారాలతో నిందితుడిగా రుజువైన 21 రోజులలో మరణ శిక్ష పడేలా చట్టం తేవడం జరిగింది. ఇలాంటి కేసులకొరకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నారు.

జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చిరంజీవి స్వాగతించారు. మహిళల రక్షణ దిశగా ఆయన చేసిన నూతన చట్టం ప్రస్తుత పరిస్థుతులలో చాలా అవసరం అని ఆయన కొనియాడారు. కాగా నిన్న పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు సౌభాగ్య దీక్ష చేయగా, అదే రోజు మెగాస్టార్ చిరంజీవి జగన్ విధానాలను మెచ్చుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇక చిరంజీవి 152 చిత్రం దర్శకుడు కొరటాల శివతో చేస్తుండగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :

X
More