“ఆచార్య” బ్యాక్ డ్రాప్ ఏంటో చెప్పేసిన మెగాస్టార్.!

Published on Mar 19, 2021 9:00 am IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో గట్టిగా ఎదురు చూస్తున్నారు. పైగా ఈ చిత్రంలో మెగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉండడంతో ఈ సినిమా హైప్ ఇంకో స్థాయికి వెళ్ళింది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఎప్పటి నుంచో అనేక రకాల రూమర్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ఏ బ్యాక్ డ్రాప్ అన్న దానిపై కూడా వినిపించాయి.

కానీ ఇప్పుడు ఈ సినిమా ఏ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది అన్నది స్వయంగా చిరునే రివీల్ చేసేసారు. రానా దగ్గుబాటి నటించిన లేటెస్ట్ చిత్రం “విరాట పర్వం” టీజర్ ను లాంచ్ చేసి మాట్లాడుతూ ఈ సినిమా నక్సల్ బ్యాక్ డ్రాప్ అన్నట్టు అర్ధం అయ్యిందని విచిత్రం ఏమిటంటే నేను చేస్తున్న ఆచార్య కూడా నక్సల్ బ్యాక్ డ్రాప్ లోనిదే అని అసలు విషయం చెప్పేసారు. దీనితో ఈ క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ చిత్రానికి ఆల్ టైం మెగా సూపర్ హిట్ కాంబో మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :