కొరటాల సినిమాలో చిరు రోల్ పై క్లారిటీ వచ్చేసింది..!

Published on Feb 23, 2020 8:57 am IST

టాలీవుడ్ క్రేజీ దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఆయన అపజయం ఎరుగని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు. ఐతే ఈ చిత్రంలో చిరంజీవి రోల్ పై క్లారిటీ వచ్చేసింది. సమాజ హితవు కోసం పనిచేసే సోషల్ యాక్టీవిస్ట్ గా చిరు పాత్ర ఉంటుందని అర్థం అవుతుంది. నిన్న కొరటాల సినిమాలోని చిరంజీవి లుక్ బయటికి వచ్చింది. మెడలో ఎర్ర కండువా, ముదురు ఆకు పచ్చ రంగు చొక్కా ధరించి ఉన్న చిరు మాస్ లుక్ అదిరింది.

ఆయన ఎర్ర కండువా వేసుకొని ఉండటం చూస్తుంటే చిరు పాత్ర మార్క్సిస్ట్ భావాలు కలిగిన వాడిగా ఉండే అవకాశం కలదు. ఇప్పటికే సోషల్ మెస్సేజ్ తో కూడిన కమర్షియల్ మూవీ కొరటాల చేస్తున్నారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, చిరు లుక్ లీక్ కావడంతో ఆ సోషల్ కాన్సెప్ట్ పాళ్ళు కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనిపిస్తుంది. ఏది ఏమైనా ఒక్క ఫొటోతో చిరు సినిమాపై అంచనాలు పెంచేశారు. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More