చిరు గుండు లుక్ వెనుక మిస్టరీ ఇదే.!

Published on Sep 15, 2020 1:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్య చిత్రాల్లో నటించారు. ఎన్నో వైవిధ్య పాత్రల్లో కూడా కనిపించారు. అయితే లేటెస్ట్ గా చిరు ఇంతకు ముందు ఎన్నడూ కనిపించని లుక్ లో కనిపించి ఆశ్చర్య పరచడంతో ఆ లుక్ కాస్తా ఒక్కసారిగా వైరల్ అయ్యింది. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా చిరు గుండు లుక్ లో ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేసారు. దానికి అనూహ్యమైన స్పందన వచ్చింది.

అయితే చిరు ఇప్పుడు కొరటాలతో “ఆచార్య” చిత్రం చేస్తున్నారు దానికి ఈ లుక్ అవసరం లేదు. కానీ తర్వాత మెహర్ తో చేయనున్న వేదాళం రీమేక్ కు అవసరం ఉంది. మరి అప్పుడే ఎందుకు ఈ లుక్ లో కనిపించారు అని ప్రశ్న వచ్చింది. అయితే నిజంగానే చిరు ఆ లుక్ లోకి మారారా అంటే లేదనే సమాధానం ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ లుక్ ను ఎలా సిద్ధం చేసారో కూడా చిరు ఇప్పుడు రివీల్ చేసేసారు.

ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీనే ఉపయోగించి చిరు ఈ లుక్ ను రెడీ చేసారు. ఒక స్పెషల్ మేకప్ టీం తో తన హెయిర్ పైనే స్పెషల్ మేకప్ ద్వారా ఆ అర్బన్ మాంక్ లుక్ లోకి మారిపోయారు. తనకి ఇలా మేకప్ చేసిన టీం కు చిరు థాంక్స్ చెప్పడమే కాకుండా సినిమా మ్యాజిక్ కు సెల్యూట్ చేసారు. దీనితో చిరు రేపిన సస్పెన్స్ కు ఇప్పుడు తెర పడింది అని చెప్పాలి. మరి ఈ లుక్ ను వేదాళం రీమేక్ కోసమేనా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More