
మెగా అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మోమెంట్.. మా మెగాస్టార్ చిరంజీవిని మళ్ళీ ఎప్పుడు వెండితెరపై చూస్తాం. ఇలా ఎదురు చూస్తున్న మెగా అభిమానుల పూర్తి ఆకలి ఆయన తీర్చలేకపోయినా ఒక 3 నిమిషాల పాటు ఓ సూపర్బ్ యాక్షన్ ఎపిసోడ్ తో తెరపై కనిపించి కనువిందు చేయడానికి సిద్దమయ్యాడు. ఇదంతా మీరు చూడబోయేది తన తనయుడు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘బ్రూస్ లీ’ సినిమాలో.. ఇదిలో అయన ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.
దానికి సంబందించిన షూటింగ్ మూడు రోజుల క్రితం ప్రారంభమైంది. మూడు రోజులుగా కంటిన్యూగా ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం షూట్ లో పాల్గొన్న చిరు తన పార్ట్ షూటింగ్ ని ఫినిష్ చేసాడు. ఈ మూడు రోజులు చరణ్ దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. చిరు ఎపిసోడ్ చాలా బాగా వచ్చిందని చరణ్ తో పాటు మిగతా టీం అంతా కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఉన్నది 3 నిమిషాలే అయినా అభిమానులకు మాత్రం పెద్ద పండగలా ఉండేలా ఆ ఎపిసోడ్ ని తయారు చేసినట్లు సమాచారం.
అక్టోబర్ మొదటి వారం కల్లా షూటింగ్ పూర్తవుతుంది. దసరా కానుకగా అక్టోబర్ 16న సినిమా రిలీజ్ కానుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది

