
మెగాస్టార్ చిరనజీవి కంబ్యాక్ ఫిల్మ్ మరియు చిరు 150వ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చిరు కూడా అభిమానులందరినీ మెప్పించేలా ఉండే కథ కోసం కొద్ది నెలలుగా పలు రకాల కథలను వింటూ, పలు సూపర్ హిట్ సినిమాలను కూడా రీమేక్ చేద్దాం అని ట్రై చేసాడు. ఇన్ని రోజులుగా క్లారిటీ రాని ఈ విషయంపై బాగా క్లారిటీ వచ్చినట్టుఅనిపిస్తోంది . అలాగే చిరు 150వ సినిమాకి కథ కూడా దొరికేసినట్లు సమాచారం. ఎవరికీ చిరు దర్శకత్వ బాధ్యతలు ఇస్తాడా అనే విషయంపై కూడా క్లారిటీ వచ్చింది.
చిరంజీవి అందరినీ పక్కన పెట్టి తన 150వ సినిమా దర్శకత్వ బాధ్యతలు తనకి ‘ఠాగూర్’ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వివి వినాయక్ కి అప్పగించినట్లు సమాచారం. అంతే కాకుండా 150వ సినిమా క్సోం తమిళంలో సూపాట్ హిట్ అయిన ‘కత్తి’ సినిమా రీమేక్ నే ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయంపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన కూడా చేయనున్నారని మెగా ఫ్యామిలీ సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతున్న ఈ సినిమాని నవంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నట్టు సమాచారం. మరి ఈ సినిమా గురించిన మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మా సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి.

