చిట్ చాట్ : రమేష్ సామల – కొలంబస్ చిత్రం విజయవంతం చేసిన ప్రేక్షకులకి నా ధన్యవాదాలు.

చిట్ చాట్ : రమేష్ సామల – కొలంబస్ చిత్రం విజయవంతం చేసిన ప్రేక్షకులకి నా ధన్యవాదాలు.

Published on Oct 26, 2015 10:54 AM IST

ramesh-samula
ఏ‌కే‌ఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై సుమంత్ అశ్విన్, సీరత్ కపూర్ మరియు మిష్టి చక్రవర్తి ప్రధానతరగణం తో ఎం‌ఎస్ రాజు కథ కథనం తో అశ్వని కుమార్ నిర్మాణం లో నిర్మించిన చిత్రం కొలంబస్. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 22నా విడుదలై విజయవంతం గా ప్రదర్శింపబడుతుంది. ఈ చిత్రానికి దర్శకుడు రమేష్ సమల. 13 ఏళ్ళు గా మాటల రచయితగా, దర్శకత్వం లో అస్సిస్టెంట్ గా కొ డైరెక్టర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గర, విజయ భాస్కర్ దగ్గర పని చేసిన రమేష్ సమల కొలంబస్ చిత్రం తో దర్శకుడుగా పరిచయం ఆయాడు. ఈ చిత్రం నేర్పిన్న అనుభవాలు తన మాటల్లో.

ప్రశ్న) సినిమా విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?

స) చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను, మా సినిమా లో పాటల ‘ దేవుడు ఒక్కడు ఉన్నడంటే నమ్మక మరి తప్పదు ఆంతే ఊహించని వరమే ఇచ్చాడే ‘, అలా నాకు ఈ సినిమా ఊహించని వరం , ఎం‌ఎస్ రాజు గారు నన్ను పిలిచ్చి, దర్శకత్వ బాధ్యతలు నాకు అప్పగించినందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. సినిమా విడుదలై విజయవంతం గా నిలిచినందుకు ఇంకా ఆనందం గా ఉంది.

ప్రశ్న) ఎం‌ఎస్ రాజు గారి సినిమా మీకు అవకాశం ఎలా వచ్చింది ?

స) నేను ఇష్క్ సినిమా కి మాటలు అందించాను , ఆ తర్వాత దిల్ రాజు గారిని కలవటం జరిగింది, ఇష్క్ సినిమా బాగుంది, మీరు ఒకసారి ఎం‌ఎస్ రాజు గారిని కలవండి అని దిల్ రాజు గారు చేపారు. ఎం‌ఎస్ రాజు గారు నాకు ఒక కథ వినిపించి దానికి నన్ను మాటలు అందించమన్నారు, స్క్రిప్ట్ అంతా సిద్దం గా ఉన్నపుడు నాకు దర్శకత్వం భాద్యతలు అప్పగించారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అలా నాకు ఎం‌ఎస్ రాజు గారి సినిమా లో అవకాశం వచ్చింది.

ప్రశ్న) ఇటీవల ఎం‌ఎస్ రాజు గారు కూడా ఒక చిత్రానికి దర్శకత్వం చేశారు, మరి ఈ చిత్రం లో ఆయన పాత్ర ఏమిటి ?

స) ఎం‌ఎస్ రాజు గారి పాత్ర అన్ని క్రాఫ్ట్ లలో ఉంది, ఔట్ పుట్ బాగా వచ్చిందా లేదా ఎవరెవరు ఏం పని చేస్తున్నారు, సినిమా బాగా వస్తుందా లేదా చూసుకునేవాళ్లూ కానీ నా డైరక్షన్ లో ఆయన హస్తం లేదు, నాకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు.

ప్రశ్న) సినిమా ని ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?

స) సినిమా చాలా బాగా వచ్చింది, ప్రేక్షకులకి చాలా బాగా నచ్చింది, నాకు చాలా ఫోన్ కాల్స్ ఎస్‌ఎం‌ఎస్ లు వచ్చాయి, సినిమా ని అందరూ మెచ్చుకున్నారు. కలెక్షన్స్ లు బాగున్నాయి, ప్రొడ్యూసర్, డిస్ట్రిబూటర్ అందరూ చాలా హిప్పీ గా ఉన్నారు. ఈ దసరా పండగ నాకు చాలా స్పెషల్ గా నిలిచింది.

ప్రశ్న) ఈ చిత్రానికి సుమంత్ అశ్విన్ మీరు అనుకున్న హీరో పాత్రకి న్యాయం చేశాడా ?

స) సుమంత్ అశ్విన్ నటన ఈ చిత్రానికి ఒక మైలు రాయి గా నిలుస్తుంది, తను ఎక్కడ ఎం‌ఎస్ రాజు గారి కొడుకు ల ఎప్పుడు ప్రవర్తించలేదు . సుమంత్ అశ్విన్ నా మొదటి సినిమా కి హీరో గా చేయడం నా అదృష్టం , అలాగే మిష్టి చక్రవర్తి మరియు సీరత్ కపూర్ వాళ్ళ పాత్రకి ప్రాణం పోశారు. యూత్ ని అలరించే గ్లామర్ తో పాటు మంచి నటనతో కొలంబస్ చిత్రని సూపర్ హిట్ చేశారు.

ప్రశ్న) ఈ సినిమా తర్వాత ప్లాన్స్ ఏమిటి ?

స) ఇంకా ఏమీ అనుకోలేదు, చర్చలు జరుగుతున్నాయి త్వరలో మంచి సినిమా తో మీ ముందుకు వస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు