మెట్రో రైలులో షూటింగ్ సూపర్ – సాయిధరమ్ తేజ్

Published on Dec 15, 2018 5:51 pm IST

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ‘నేను శైలజ’ ఫెమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం యొక్క షూటింగ్ 60 శాతం కంప్లీట్ అయ్యిందని సమాచారం. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ చిత్ర పాత్రలో నటిస్తుండగా .. నివేత పేతురాజ్ లహరి పాత్రలో కనిపించనుంది.

కాగా తాజాగా ఈ చిత్రం హైదరాబాద్ మెట్రో రైల్ లో షూటింగ్ జరుపుకుంది. మెట్రో ట్రైన్ లో తమ చిత్రం షూటింగ్ సూపర్ గా జరిగిందని సాయిధరమ్ తేజ్ ఓ వీడియో ద్వారా తెలిపారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను సక్సెస్‌ఫుల్‌ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై రూపొందించనున్నారు. ప్రముఖ హాస్య నటుడు కమ్ హీరో సునీల్ ఒక ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

సంబంధిత సమాచారం :