చియాన్ విక్రమ్ ఒక గ్యాంగ్ స్టర్

Published on Sep 30, 2020 1:37 am IST


విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మూడు విభిన్న చిత్రాలే. ఒక్కొక్క సినిమా ఒక్కో జానర్. అజయ్ ఙ్ఞానముత్తు డైరెక్షన్లో చేస్తున్న ‘కోబ్రా’లో విక్రమ్ 35 భిన్న వేషధారణల్లో కనిపించనుండగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం ఒక పిరియాడికల్ డ్రామా. ఇందులో కూడ విక్రమ్ ఒక భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక ఆయన చేస్తున్న మరొక చిత్రాన్ని ‘పిజ్జా, పేట’ ఫేమ్ కార్తీక్ సుబ్బారాజు డైరెక్ట్ చేస్తున్నారు. కార్తీక్ తన ప్రతి సినిమాలో వైవిధ్యం తప్పకుండా ఉండేలా చూసుకుంటారు.

అలాగే విక్రమ్ సినిమా కూడ విభిన్నంగా ఉండేలా చేస్తున్నారట. ఇందులో విక్రమ్ కుమారుడు, ధృవ్ విక్రమ్ నటిస్తున్నాడు. ధృవ్ తన మొదటి సినిమా ‘ఆదిత్య’ వర్మతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా తండ్రీ కొడుకులు నటిస్తుండటం సినిమాలో సినిమాపై ప్రేక్షకుల్లో అమితాశక్తి నెలకొంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఒక గ్యాంగ్ స్టర్ డ్రామా అని తెలుస్తోంది. అంటే సినిమాలో విక్రమ్ ఒక గ్యాంగ్ స్టర్ పాత్ర చేస్తారన్నమాట. కథ విక్రమ్ వెర్సెస్ ధృవ్ విక్రమ్ అనేలా ఉంటుందట. త్వరలో ఈ సినిమా షూట్ కొడైకెనాల్ లోకేషన్లలో మొదలుకానుంది. సినిమా గ్యాంగ్ స్టర్ డ్రామా అని తెలియడంతో ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :

More