ఆ 300 కోట్ల సినిమాలో విక్రమ్ లేనట్టేనా ?

Published on Feb 24, 2021 9:08 pm IST

హీరో చియాన్ విక్రమ్ గతంలో ఒక భారీ పిరియాడికల్ డ్రామాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. మహాభారతంలోని ప్రముఖ పాత్ర అయిన కర్ణుడి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆర్.ఎస్.విమల్ ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో విక్రమ్ టైటిల్ రోల్ అయిన కర్ణుడి పాత్రను పోషించడానికి అప్పట్లో ఒప్పుకున్నారు. కొంత భాగం షూటింగ్ కూడ జరిగింది. కానీ ఏమైందో ఏమో కానీ ఇప్పుడు సినిమాలో విక్రమ్ నటించట్లేదనే ప్రచారం మొదలైంది.

చిత్ర నిర్మాణ సంస్థ పూజా ఎంటర్టైన్మెంట్స్ నిన్న సినిమాకు సంబంధించిన చిన్నపాటి టీజర్ రిలేజ్ చేసింది. అందులో విక్రమ్ ఎక్కడా కనిపించలేదు. కనీసం ఆయన పేరును కూడ మెన్షన్ చేయలేదు. సినిమా టైటిల్ ‘సూర్యపుత్ర మహావీర్ కర్ణ’ అని, హిందీ, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలో రిలీజ్ అవుతుందని మాత్రమే చెప్పారు. మొదటి టీజర్లో విక్రమ్ కానీ ఆయన పేరు కానీ లేకపోవడంతో సినిమాలో ఆయన లేరని దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఆయన కాకుండా ఆ పాత్రను ఎవరు చేస్తున్నారనేది కూడ రివీల్ చేయలేదు చిత్రం బృందం. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. ఇకపోతే విక్రమ్ ప్రస్తుతం ‘కోబ్రా’ సినిమాతో పాటు మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ అనే పిరియాడికల్ డ్రామాలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :