ప్రముఖ తెలుగు సినీ నటుడు కన్నుమూత !

Published on Oct 21, 2018 10:13 am IST

తెలుగు సినిమాల్లో, టీవీ సీరియళ్లలో అనేక పాత్రల్లో నటించి మెప్పించిన ప్రముఖ సినీ నటుడు వైజాగ్‌ ప్రసాద్‌ ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. రెండేళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా అకస్మాత్తుగా ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను నిమ్స్‌ హాస్పిటల్ కి తరలించారు.

కానీ వైజాగ్‌ ప్రసాద్‌ చికిత్సపొందుతూ కన్నుమూశారు. ఆయనకు వయసు 75 సంవత్సరాలు.. బాలయ్య ‘బాబాయ్‌ అబ్బాయ్‌’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. అయితే ఆ తరువాత ‘నువ్వు నేను, జై చిరంజీవ, భద్ర, గౌరీ’ వంటి చిత్రాల్లో నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని ప్రశంసలను ఆయన అందుకున్నారు.

సంబంధిత సమాచారం :