యు ట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ సాంగ్

యు ట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ సాంగ్

Published on Oct 4, 2015 3:14 PM IST

race-gurram1
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా బాక్స్ ఆఫీసు వద్ద కూడా అల్లు అర్జున్ కి 50 కోట్ల మార్క్ తెచ్చి పెట్టిన సినిమా ‘రేసుగుర్రం’. హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సురేందర్ రెడ్డి డైరెక్టర్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో, అంతే రేంజ్ లో తమన్ మ్యూజిక్ అందించిన ఆడియో కూడా హిట్ అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ‘సినిమా చూపిస్తా మావ’ సాంగ్ చాలా పెద్ద హిట్ అయ్యింది. వినడానికే కాదు చూడటానికి కూడా ఈ సాంగ్ పిక్చరైజేషన్ చాలా బాగుంటుంది.

తాజాగా ఈ సాంగ్ యు ట్యూబ్ లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ వీడియో సాంగ్ ని యు ట్యూబ్ లో ఓక కోటి వ్యూస్ వచ్చాయి. ఈ చిత్ర ప్రొడక్షన్ హౌస్ అయిన లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ వారి యు ట్యూబ్ చానల్ లో కోటి వ్యూస్ క్రాస్ చేసింది. ఒక సౌత్ ఇండియన్ ఫిల్మ్ సాంగ్ కి ఈ రేంజ్ లో వ్యూస్ రావడం ఇదే మొదటి సారి. ఫుల్ మాస్ స్టెప్స్ తో మాస్ చేత డాన్సులు వేయించేలా చేసిన ఈ సాంగ్ కి ఈ రేంజ్ వ్యూస్ రావడం హ్యాపీగా ఉందని నిర్మాతలు అంటున్నారు.

సినిమా చూపిస్త మావ వీడియో సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు