17 రోజుల్లోనే ‘మేము కాప్‌లం’ షూటింగ్ పూర్తి – సినిమాటోగ్రాఫర్ కిషోర్

17 రోజుల్లోనే ‘మేము కాప్‌లం’ షూటింగ్ పూర్తి – సినిమాటోగ్రాఫర్ కిషోర్

Published on May 24, 2026 8:00 AM IST

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ‘మేము కాప్‌లం’ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లోనే చిత్రీకరించినట్లు సినిమాటోగ్రాఫర్ కిషోర్ బోయిడాపు వెల్లడించారు. నాగబాబు ప్రధాన పాత్రలో ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను పక్కా ప్రణాళికతో, అన్ని విభాగాల సమన్వయంతోనే రికార్డు సమయంలో పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు.

​కెమెరా అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించిన కిషోర్.. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’, ‘మిషన్ ఇంపాజిబుల్ 4’ వంటి సుమారు 15 హాలీవుడ్ చిత్రాలకు పనిచేశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అనిల్ మెహతా వద్ద ‘ఏ దిల్ హై ముష్కిల్’ నుంచి ‘జెర్సీ’ వరకు పలు చిత్రాలకు పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన సింగిల్ షాట్ సినిమా ‘105 మినిట్స్’కి కూడా కిషోర్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. హాలీవుడ్ సినిమాల్లో నేచురల్ టోన్ ఉపయోగిస్తే, భారతీయ సినిమాల్లో మన వాతావరణం, ఎమోషన్స్‌కు తగ్గట్టుగా వైబ్రంట్ కలర్స్ వాడుతారని ఆయన వివరించారు.

​దర్శకత్వం వైపు వెళ్లే ఆలోచన ప్రస్తుతానికి లేదని, ఏఐ టెక్నాలజీపై దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. కిషోర్ కెమెరామెన్‌గా పనిచేసిన ‘ప్రేమకు నమస్కారం’ (షణ్ముఖ్, శివాజీ, భూమిక) విడుదలకు సిద్ధంగా ఉండగా, రాజీవ్ కనకాల నటిస్తున్న ‘మన డాక్టర్ బాబు’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు తెలిపారు.

తాజా వార్తలు