సెప్టెంబర్ 6 న విడుదల కానున్న ఆది “క్లాప్” టీజర్!

Published on Sep 2, 2021 6:53 pm IST

ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం క్లాప్. ఈ చిత్రం లో ఆది స్ప్రింటర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన సరికొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది. ట్రాక్ పై స్ప్రింట్ కి రెడీ గా ఉన్న ఆది, ఈ చిత్రం టీజర్ కి సంబంధించిన ఒక అప్డేట్ ను పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది.

క్లాప్ చిత్రం కి సంబంధించిన టీజర్ ను ఈ నెల 6 వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ చిత్రం లో ఆకాంక్ష సింగ్, కృష్ణ కురూప్, ప్రకాష్ రాజ్, మిమే గోపి, నాజర్, మునిష్ కాంత్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం కి పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన రిలీజ్ డేట్ త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :