NBK 111: కాజల్ రోల్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చేసిందిగా!

NBK 111: కాజల్ రోల్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చేసిందిగా!

Published on Jul 9, 2026 9:00 AM IST

Kajal Aggerwal

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ లో బ్యూటీ కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. ఇప్పుడు లీడ్ పాత్రలతో పాటుగా హీరోయిన్ గా కూడా పలు సినిమాలు చేస్తుంది. అలా లేటెస్ట్ గా నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తుంది. ఆల్రెడీ భగవంత్ కేసరి సినిమాలో చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు బాలయ్య 111వ సినిమాలో ఆమె నటిస్తుండగా ఆమె తాలూకా ఫస్ట్ లుక్ కూడా మేకర్స్ వదిలారు. అయితే ఆమె రోల్ పై రీసెంట్ గా ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వచ్చింది. ఆమె ఈ సినిమాలో ఓ సీరియస్ రోల్ లో ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ గా కనిపిస్తుంది అని టాక్ వచ్చింది. ఇప్పుడు ఆమె లేటెస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

బాలయ్య సినిమాలో తన రోల్ ఫన్నీగా అయితే ఉండదని సీరియస్ గానే ఉంటుంది అని ఆమె క్లారిటీ ఇచ్చింది. సో ఈసారి బాలయ్య వర్సెస్ కాజల్ అనుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు