రజనీ పొలిటికల్ ఎంట్రీ మీద క్లారిటీ వచ్చింది
Published on Sep 28, 2016 11:43 am IST

Rajinikanth
మన దేశంలో సినీ రంగంలో నెం1 స్థానంలో వెలుగొందే వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం పరిపాటే. ఎన్టీఆర్, ఎంజీఆర్, చిరంజీవి వంటి వాళ్లంతా అలా వచ్చినవారే. కానీ రజనీకాంత్ మాత్రం ఇప్పటి వరకూ రాజకీయాల్లోకి రాలేదు. తమిళనాడు, కర్ణాటకల్లో అశేష అభిమానుల్ని సంపాదించుకున్న ఆయన రాజకీయాల్లోకి వస్తే చూడాలని అభిమానాలు ఎప్పటి నుండో వేచి చూస్తున్నారు. గతంలో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని, కొత్త పార్టీ పెడుతున్నారని వార్తలొచ్చాయి. కానీ అవేమీ జరగలేదు.

తాజాగా ఇదే విషయంపై ఓ బలమైన క్లారిటీ వచ్చింది. రజనీకాంత్ తమ్ముడు సత్యనారాయణ తాజాగా రామేశ్వరం దేవాలయాన్ని సందర్శించుకున్నారు. అక్కడ మీడియా ఆయన్ను రజనీ పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశ్నించగా ఆయన రజనీకాంత్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి రారని, ఆయ్నకు రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి లేదని కుండబద్దలు కొట్టారు. దీంతో అందరికీ పూర్తి వివరణ దొరికినట్టయింది. ఇకపోతే రజనీ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘రోబో2.0’ చిత్రంలో నటిస్తున్నారు.

 
Like us on Facebook