మరికొన్ని గంటల్లో ‘రంగస్థలం’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా యూనిట్ అందరూ ఫలితంపై కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇన్సైడ్ టాక్ ప్రకారం సినిమాలోని చివరి 20 నిమిషాలు ప్రేక్షకులను అకట్టిపడేస్తుందని తెలుస్తోంది. ప్రీ క్లైమాక్స్ నుండి సినిమా చివరి వరుకు ఒకే ఎమోషన్ ను క్యారీ చేస్తూ సినిమా సాగుతుందని సమాచారం.
చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా ప్రేక్షకులను అలరించబోతున్నాడని చెప్తున్నారు. సమంత, అనసూయ, ఆది పినిశెట్టి రోల్స్ సినిమాకు మరో ఆకర్షణ కానున్నాయట. విడుదలకు ముందు కొన్ని సినిమాలకు విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. అలా ‘రంగస్థలం’ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది.
