సీఎం జగన్ బయోపిక్.. నటుడెవరంటే?

Published on Jul 3, 2021 12:40 am IST


దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితగాధ ఆధారంగా “యాత్ర” సినిమాను తెరకెక్కించి అందరిచేత ప్రశంసలు అందుకున్న మహి వి. రాఘవ ఇప్పుడు వైఎస్ కుమారుడు, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వైఎస్ మరణానంతరం ప్రజల్లో మాస్ లీడర్‌గా జగన్ ఎదిగిన తీరు, సీఎంగా ఆయన ప్రయాణం వంటి అంశాల ఆధారంగా ఈ కథను రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే ఈ బయోపిక్‌ను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇందులో భాగంగానే ‘స్కామ్‌ 1992’ అనే వెబ్‌ సిరీస్‌తో మంచి పాపులారిటీ దక్కించుకున్న బాలీవుడ్‌ నటుడు ప్రతీక్‌ గాంధీని జగన్‌ పాత్రని పోషించేందుకు ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :