ఫ్యాన్స్ కి ఓ రోజు ముందే పండుగ తెస్తున్న ‘జన నాయగన్’ విజయ్!

ఫ్యాన్స్ కి ఓ రోజు ముందే పండుగ తెస్తున్న ‘జన నాయగన్’ విజయ్!

Published on Jul 15, 2026 10:00 AM IST

Jana Nayagan

కోలీవుడ్ స్టార్ హీరో ఇప్పుడు సీఎం విజయ్ హీరోగా నటించిన ఆఖరి సినిమానే జన నాయగన్. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా ఈ ఏడాది జనవరిలోనే విడుదల కావాల్సి ఉంది కానీ అనేక కారణాలు రీత్యా సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా విజయ్ సీఎం అయ్యాక అయినా వెంటనే వస్తుంది అనుకుంటే ఇక్కడ కూడా ఆలస్యం అవుతూ వచ్చింది.

అయితే ఈ కొన్ని రోజులు నుంచి ఈ జూలై 24 డేట్ కన్ఫర్మ్ అయినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సినిమా సహా నిర్మాత, విజయ్ పీ ఎస్ జగదీష్ పలని స్వామి జన నాయగన్ విడుదల ఒక రోజు ముందే అంటే జూలై 23నే ఉంటుంది అని కన్ఫర్మ్ చేసేసారు. సో ఫ్యాన్స్ కి దళపతి సీఎం విజయ్ ఓ రోజు ముందే పండుగ తెస్తున్నారు అని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమాకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అలాగే మమితా బైజు కీలక పాత్రలో నటించగా అనిరుద్ సంగీతం అందించారు. కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు