టీజర్ తో వచ్చిన ‘కాలేజ్ కుమార్` !

Published on Dec 9, 2019 10:04 pm IST

సీనియర్ హిరో నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో ‘కాలేజ్ కుమార్` అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం . టీజర్ లో మూవీ కాన్సెప్ట్ ను క్లారిటీగా ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ప్రధాన పాత్రలను ఇంట్రస్టింగ్ గా మలిచారు. మొత్తానికి టీజర్ సినిమా పై అంచనాలను పెంచింది.

కాగా హరి సంతోష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పద్మనాభ నిర్మిస్తున్నారు. మధుబాల- రాహుల్ విజయ్- ప్రియ వడ్డమాని తారాగణం. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపులో ఉంది. ఇక ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పాత్ర కీలకంగా ఉంటుందట. ఇందులో ఓల్డేజ్ గెటప్ తో పాటు మరో గెటప్ లో కూడా ఆయన కనిపించనున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :

X
More