నవ్వులు పండితే హిట్ పక్కా

Published on Feb 26, 2020 3:01 am IST

కామెడీ ఎంటర్టైన్మెంట్ జానర్లో రూపొందే సినిమాలకు మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. చిన్న సినిమాలే అయినా మంచి హాస్యం ఉంటే పెద్ద విజయాన్ని అందుకుంటాయి. అలాంటిది స్టార్, మీడియమ్ స్థాయి హీరోల సినిమాల్లో నవ్వులు పండితే ఆ విజయం ఇంకాస్త పెద్దదిగా ఉంటుంది. ఈ విషయాన్ని నితిన్ కొత్త చిత్రం ‘భీష్మ’ ప్రూవ్ చేసింది. వెంకీ కుడుముల డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం గత వారం విడుదలై ఇన్స్టెంట్ హిట్ అనిపించుకుంది.

అందుకు ప్రధాన కారణం సినిమాలోని ఫన్. నితిన్, సంపత్, వెన్నెల కిషోర్, హీరోయిన్, ఇతర ముఖ్య పాత్రలన్నిటికీ హ్యూమర్ టచ్ ఇచ్చారు డైరెక్టర్ వెంకీ కుడుముల. ఈ పాత్రలన్నీ ప్రేక్షకుల్ని నవ్వించగలిగాయి. అందుకే చిత్రం పూర్తి పాజిటివ్ టాక్ తెచ్చుకుని వసూళ్లలో దూసుకుపోతోంది. ఈ విజయంతో వరుస పరాజయాల్లో ఉన్న నితిన్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు. సో.. హీరో ఎవరైనా తమ సినిమాల్లో హెల్తీ కామెడీని పండించగలిగితే విజయాన్ని ఖాతాలో వేసుకున్నట్టే.

సంబంధిత సమాచారం :

X
More