సీరియస్ రోల్ లో కామెడీ హీరో !

Published on Feb 24, 2019 2:30 am IST

ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ గత కొంత కాలంగా వరస పరాజాయాల్తో సతమతమవుతున్నాడు. ఇటీవల సరైన హిట్లు లేక పోవడంతో ఏడాదికి నాలుగు ,అయిదు సినిమాలు చేసే ఈ హీరో గత మూడు సంవత్సరాల నుండి ఒకటే సినిమా తో సరిపెట్టుకున్నాడు. ఇక ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని తన రూట్ మార్చుకొని సీరియస్ పాత్రలో నటించనుడానికి రెడీ అవుతున్నాడు.

ఈ. సత్తిబాబు డైరెక్షన్ లో అల్లరి నరేష్ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నరేష్ సీరియస్ రోల్ లో నటించనున్నాడు. లక్ష్య ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :