తాకట్టు కొట్టులో అనుష్కతో కామెడీ చేస్తున్న రజినీకాంత్

తాకట్టు కొట్టులో అనుష్కతో కామెడీ చేస్తున్న రజినీకాంత్

Published on Jun 25, 2014 11:13 AM IST

rajnikanth-anushka
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం ‘లింగా’ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అందులోనూ రజినీ కాంత్, అనుష్క మరియు కమెడియన్ సంతానంపై డైరెక్టర్ కెఎస్ రవి కుమార్ కామెడీ సీన్స్ ని షూట్ చేస్తున్నాడు.

వీళ్ళు ముగ్గురు కలిసి ఓ నగలు తాకట్టు కొట్టుకు వెళ్ళారు. అక్కడికి ఎందుకు వెళ్ళారన్నది డైరెక్టర్ కి మాత్రమే తెలిస్తే అక్కడ ఒకరిపై ఒకరు పంచ్ లు విసురుకుంటూ ప్రేక్షకులను నవ్వించడానికి కామెడీ చేస్తున్నారు. రజినీకాంత్ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రజినీకాంత్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్న ఈ సినిమాని దీపావళి కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు