ఇండిపెండెన్స్ డే స్పెషల్: కామెడీ స్టార్స్‌లో అల్లూరి ఫ్యామిలీ..!

Published on Aug 13, 2021 10:00 am IST

స్టార్ మాలో వచ్చే “కామెడీ స్టార్స్” కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఈ కార్యక్రమం ఈ వారం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ద్వారా అలరించబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇందులో మన్యం దొర, బ్రిటీష్ వారి తుఫాకులకు రొమ్ము చూపించిన విప్లవ వీరుడు అల్లూరి సీతరామరాజును గుర్తు చేసుకున్నారు. ప్రజా గాయకుడు గద్దర్ అల్లూరిపై చక్కటి పాటను వినిపించాడు.

అంతేకాకుండా అల్లూరి కుటుంబ సభ్యులను, జమ్ము కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన గుంటూరు జవాన్ తల్లిదండ్రులను కూడా షోకు ఆహ్వానించారు. తమ వారిని గుర్తు చేసుకుని ఆ ఫ్యామిలీలు ఎమోషన్ కాగా అవి కన్నీరు తెప్పించాయి. దేశం కోసం వీరమరణం పొందిన సైనికులకు ఈ కార్యక్రమంలో నివాళులు అర్పించారు. మరీ ఈ స్పెషల్ ఎమోషనల్ ఎపిసోడ్‌ను మిస్ కాకూడదంటే ఈ ఆగష్ట్ 15 ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు స్టార్ మా లో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ కార్యక్రమాన్ని చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :