లవ్ ఫెయిల్యూర్ స్కిట్ తో కామెడీ స్టార్స్ లో అదరగొట్టిన సద్దాం!

లవ్ ఫెయిల్యూర్ స్కిట్ తో కామెడీ స్టార్స్ లో అదరగొట్టిన సద్దాం!

Published on Aug 5, 2021 2:00 PM IST

స్టార్ మా సరికొత్త కార్యక్రమాల తో ప్రేక్షకులకు వినోదం అందిస్తుంది. అయితే కామెడీ స్టార్స్ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. ఈ కార్యక్రమం తో ప్రేక్షకులను ఆద్యంతం నవ్వులు పూయించడం మాత్రమే కాకుండా, వినోదం ను అందిస్తుంది.

అయితే ఈ కార్యక్రమం లో సద్దాం చేసినటువంటి స్కిట్ హైలెట్ అని చెప్పాలి. లవ్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ తో నవ్వులు పూయించడం చాలా వెరైటీ అని చెప్పాలి. అయితే సరికొత్తగా స్టార్ మా విడుదల చేసిన ప్రోమో లో సద్దాం స్కిట్ మొత్తం కూడా పంచు డైలాగు లతో, కామెడీ తో నిండి ఉంది అని చెప్పాలి. అయితే ఈ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు