పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి దేవుడుగా, విక్టరీ వెంకటేష్ ఓ కామన్ మాన్ గా కనిపించనున్న సినిమా ‘గోపాల గోపాల’. ఇటీవలే ఈ సినిమాలోని పతాక సన్నివేశాలను హైదరాబాద్ నగర శివార్లలో తెరకెక్కించారు. ఈ షూటింగ్ లో వెంకటేష్, శ్రియ, మిదున్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ని త్వరలోనే హైదరాబాద్ లో ప్రారంభించనున్నారు.
‘దేవుడినే సవాల్ చేసే ఓ భక్తుని కథ ఇదని, ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందని’ ఈ చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న డైరెక్టర్ కిషోర్ పార్ధసాని(డాలీ) ఈ మూవీలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్, పెర్ఫార్మన్స్ సినిమాకి మేజర్ హైలైట్ అవుతుందని ఎంతో నమ్మకంగా ఉన్నారు.
‘గోపాల గోపాల’ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ సినిమాకి రీమేక్. సురేష్ ప్రొడక్షన్స్ – నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు


