‘కాన్‌ప్లెక్స్ సినిమాస్’ను లాంచ్ చేసిన ప్రముఖులు

‘కాన్‌ప్లెక్స్ సినిమాస్’ను లాంచ్ చేసిన ప్రముఖులు

Published on Sep 24, 2025 8:05 AM IST

ss

హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో నాగార్జున సర్కిల్‌లో కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్ను బుధవారం (సెప్టెంబర్ 24) ఘనంగా ప్రారంభించారు. ఈ మల్టీప్లెక్స్‌ను విజ్ఞాన్ యార్లగడ్డ, హర్ష కొత్తపల్లి, సుజిత్ రెడ్డి గోలి కలిసి నిర్మించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నాగవంశీ, మరియు ప్రణీత్ గ్రూప్ MD నరేంద్ర కామరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. “థియేటర్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఒక్కసారి సందర్శించాలి. ఈ కార్యక్రమానికి సినీ హీరో సిద్దు, నిర్మాతలు చినబాబు, నాగవంశీ హాజరైనందుకు ఆనందంగా ఉంది” అన్నారు.

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. “థియేటర్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. స్క్రీన్, సీటింగ్ అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది” అన్నారు.

విజ్ఞాన్ యార్లగడ్డ మాట్లాడుతూ.. “ఇది గుజరాత్ బ్రాండ్, దేశవ్యాప్తంగా 250కి పైగా స్క్రీన్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇది మొదటి థియేటర్. మూడు స్క్రీన్లలో 171 సీట్లు ఉన్నాయి. భవిష్యత్తులో ఏపీ, తెలంగాణలో మరిన్ని స్క్రీన్లను ప్రారంభించాలనుకుంటున్నాం. అన్ని చిత్రాలకు ఫస్ట్ డే ఫస్ట్ షోలను ఇక్కడే ప్రారంభిస్తాం. ‘OG’తో మా స్క్రీన్లను ప్రారంభిస్తున్నాం” అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు