సూపర్ స్టార్ ఇప్పుడప్పుడే షూటింగ్లో పాల్గొనరేమో ?

సూపర్ స్టార్ ఇప్పుడప్పుడే షూటింగ్లో పాల్గొనరేమో ?

Published on Sep 30, 2020 1:19 AM IST


సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం ‘అన్నాతే’. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోవడంతో చిత్రీకరణ ఆలస్యమంది. కోలీవుడ్లో ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలవుతున్న నేపథ్యంలో ‘అన్నాతే’ను కూడ రీస్టార్ట్ చేయాలని భావించారు నిర్మాతలు. ఇదే విషయాన్ని రజనీకాంత్ వద్ద ప్రస్తావించగా రజనీ సున్నితంగా తిరస్కరించారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కొవిడ్ ఉధృతి ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడం వలన రజనీ చిత్రీకరణకు హాజరుకాలేనని అన్నారట.

ప్రభుత్వం సైతం 60 ఏళ్ల వయసు పైబడిన వారు ఇంకొన్నాళ్లు ఇంటికే పరిమితమైతే మంచిదని సూచించిన సంగతి తెలిసిందే. అందుకే రజనీ ఇప్పటికిప్పుడు షూటింగ్లో పాల్గొనలేనని పరిస్థితులు పూర్తిగా చక్కబడ్డాక వస్తానని చెప్పినట్టు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో దర్శకుడు శివ రజనీ మినహా మిగతావారితో షూటింగ్ కానిచ్చి రజనీ వచ్చాక ఆయన సన్నివేశాలు షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే రజనీ స్టెట్మెంట్ విషయమై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో మీనా, నయనతార, కీర్తి సురేష్, ఖుష్బూ లాంటి స్టార్లు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు