ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన కాంట్రవర్సియల్ సిరీస్ సీజన్ 2.. ఎందులో అంటే

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన కాంట్రవర్సియల్ సిరీస్ సీజన్ 2.. ఎందులో అంటే

Published on Jan 9, 2026 2:59 PM IST

Freedom-at-Midnight

మన ఇండియన్ ఓటిటి నుంచి వచ్చిన పలు సంచలన కాంట్రవర్సియల్ సిరీస్ లలో గత 2024 లో వచ్చిన ఓ కాంట్రవర్సియల్ సిరీస్ కూడా ఒకటి. ప్రముఖ సంస్థ సోని లివ్ తీసుకొచ్చిన ఆ సిరీస్ నే ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్'(Freedom at Midnight). భారత స్వాతంత్య సమయంలో గాంధీ, నెహ్రు ఇంకా కొన్ని ముఖ్య పాత్రలు ఆధారంగా దర్శకుడు నిఖిల్ అద్వానీ తెరకెక్కించిన ఈ సిరీస్ వచ్చిన సమయంలో గట్టిగానే చర్చకి వచ్చింది.

కొన్ని డార్క్ కోణాలని ఇందులో చూపించడంతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఫైనల్ గా దీనికి సీజన్ 2 ని మేకర్స్ రిలీజ్ కి వచ్చేసింది. దీనిని కూడా సోనీ లివ్ వారు ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొచ్చేసారు. ఈ సిరీస్ ని వారు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం అలాగే తమిళ్, మరాఠీ ఇంకా బెంగాళీ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి అప్పుడు సీజన్ ని చూసినవారు దీనిని కంటిన్యూ చేయొచ్చు. ఇక ఈ సిరీస్ లో సిధాంత్ గుప్తా, చిరాగ్ వోహ్రా, రాజేంద్ర చావ్లా, ల్యూక్ మెక్‌గిబ్నీ, కోర్డెలియా బుగేజా తదితరులు నటించగా మోనిషా అద్వానీ, మధు భోజ్వానీ, డానిష్ ఖాన్ లు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు