వివాదంలో చిక్కుకున్న సన్నీలియోన్ బయోపిక్ !

Published on Jul 16, 2018 12:37 pm IST

బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడల్ట్ స్టార్ సన్నీలియోన్ కి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా సన్నీలియోన్ జీవిత కథ ఆధారంగా ‘కరెన్జిత్ కౌర్ – ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ’చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. కానీ ప్రస్తుతం ఈ చిత్రం కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది.

తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీ సిక్కు గురుద్వార మానేజ్మెంట్ కమిటీ (డి.యస్.జి.యమ్.సి) సన్నీ బయోపిక్ లో ‘కౌర్’ టైటిల్ ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తుంది. ఈ వివాదాస్పద చిత్రంతో ‘కౌర్’ పేరు వాడటం వల్ల, ‘కౌర్’కి సంబందించిన వారి మనోభావాలను దెబ్బతింటాయని డి.యస్.జి.యమ్.సి పేర్కొంది.

మరి ఈ వివాదాన్ని నిర్మాతలు ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. ఆదిత్య దత్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని వెబ్ సిరీస్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సిరీస్ జూలై 16న ఓ ఇంగ్లీష్ ఛానెల్ లో ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం :