సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన అవైటెడ్ సాలిడ్ యాక్షన్ చిత్రమే “కూలీ”. భారీ హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం అదే రేంజ్ ఓపెనింగ్స్ సాధించి తమిళ నాట ఒక రికార్డు మేకింగ్ చిత్రంగా నిలిచింది.
ఇక ఇదే రీతిలో రెండో రోజు కూడా ప్రపంచ వ్యాప్తంగా హోల్డ్ ని కనబరిచినట్టు పి ఆర్ ఎస్టిమేషన్ లెక్కలు కనిపిస్తున్నాయి. ఇలా వరల్డ్ వైడ్ గా రెండో రోజు కూలీ చిత్రం 86 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టినట్టు తెలుస్తుంది. ఇక ఇందులో ఇండియా నుంచే 55 కోట్ల గ్రాస్ తెలుగు, తమిళ్, హిందీ భాషల నుంచి అందుకుందట.
మొత్తానికి మాత్రం కూలీ కేవలం రెండు రోజుల్లోనే 200 కోట్ల మార్క్ ని సునాయాసంగా టచ్ చేసింది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా అమీర్ ఖాన్, కింగ్ నాగార్జున అలాగే సౌబిన్ సాహిర్, ఉపేంద్ర తదితరులు నటించారు. అలాగే సన్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.


