బన్నీ ఒకటి తలిస్తే…మరొకటి జరిగింది..!

బన్నీ ఒకటి తలిస్తే…మరొకటి జరిగింది..!

Published on Jul 8, 2020 8:46 AM IST

నా పేరు సూర్య మూవీ తరువాత ఏడాదిన్నర గ్యాప్ అల్లు అర్జున్ తీసుకున్నారు. ఆ మూవీపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకోగా నిరాశపరిచింది. దీనితో తర్వాత ఏమిటీ అనే సందిగ్ధంలో ఆయన ఏడాది గడిపేశారు. అనేక మంది దర్శకుల అనంతరం త్రివిక్రమ్ ని నమ్మి అల వైకుంఠపురంలో మూవీ చేశారు. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా త్రివిక్రమ్ భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చారు.

ఇక వరుసగా సినిమాలు చేయాలని ఫిక్సయిన బన్నీ అల వైకుంఠపురం తరువాత సుకుమార్ తో పుష్ప మూవీ లైన్ లో పెట్టాడు. అల వైకుంఠపురంలో మూవీ ప్రొమోషన్స్ సమయం నుండే పుష్పకోసం జుట్టు, గడ్డం పెంచేశాడు. బన్నీ ఇంత ప్రణాళికగా ఉన్నా…కరోనా వైరస్ దెబ్బేసింది. దీనితో పుష్ప షూటింగ్ కి ఇప్పటికే మూడు నెలల బ్రేక్ పడింది. 2020 లో పుష్ప కూడా విడుదల చేయాలనుకున్న బన్నీ ఆశలకు గండి కొట్టింది. పుష్ప 2021 సమ్మర్ కి వస్తుందని వార్తలు వస్తుండగా…బన్నీకి మళ్ళీ ఏడాదిన్నర గ్యాప్ వచ్చిందన్న మాట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు