యూఎస్ కౌన్సిల్ జనరల్ మెచ్చిన మహేష్ మూవీ.

Published on Aug 6, 2019 3:00 am IST

హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ కౌన్సిల్ జనరల్ గా పనిచేసిన క్యాథెరిన్ బి హడ్డా మహేష్ మూవీపై ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. “స్వదేశానికి వెళుతున్న సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని మంచి చిత్రాలను చూసే అవకాశం దొరికింది. మహేష్ నటించిన చిత్రాన్ని చాలా ఆస్వాదించాను, చిత్రంలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ పరిసరాల్లోని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మూవీ థీమ్ సాంగ్ హమ్మింగ్ చేయకుండా ఉండలేకున్నాను” అని ట్వీట్ చేసి,భరత్ అనే నేను చిత్ర టైటిల్ ఫోటో పోస్ట్ చేశారు.

అమెరికన్ జాతీయురాలు, అందులోను గౌరవ ప్రదమైన కాన్సులేట్ జనరల్ గా చేసిన ఓ మహిళ మన తెలుగు సినిమాను ప్రశంసించడం గొప్ప విషయమే అని చెప్పాలి. కాగా మహేష్,కైరా అద్వానీ జంటగా దర్శకుడు శివ కొరటాల తెరకెక్కించిన “భరత్ అనే నేను” గత సంవత్సరం వేసవి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో మహేష్ యంగ్ సీఎం గా నటించారు.

సంబంధిత సమాచారం :

More