‘ఇండియన్-2’ సమస్య మళ్ళీ మొదటికి

Published on Apr 24, 2021 12:00 am IST

శంకర్, కమల్ హాసన్ చిత్రం ‘ఇండియన్ 2’ వరుస ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మొదట బడ్జెట్ దగ్గర మొదలైన సమస్యలు ఆ తర్వాత ప్రమాదాల కారణంగా షూటింగ్ ఆగిపోవడం, నిర్మాతలు, దర్శకుడికి నడుమ అస్సలు పొసగకపోవడంతో షూటింగ్ ఆగిపోయింది. నిర్మాతలు కుదించిన బడ్జెట్లోని సినిమా చేయాలని అంటుండగా కుదరదనేది శంకర్ వాదన. నిర్మాతలు చెప్పిన బడ్జెట్ ఇప్పటికే దాటిపోగా ఇంకా 20 నుండి 25 శాతం షూటింగ్ మిగిలే ఉంది. దీంతో శంకర్ వేరే ప్రాజెక్ట్స్ చూసుకోవడం మొదలుపెట్టారు.

లైకా నిర్మాతలు కోర్టు మెట్లెక్కి ‘ఇండియన్ 2’ పూర్తిచేశాకనే శంకర్ వేరే సినిమాకు వెళ్లాలని డిమాండ్ చేశారు. శంకర్ అయితే తాను సినిమాను కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. పలుమార్లు ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం సమస్యను ఇరువురూ సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. సో… సమస్య మళ్ళీ మొదటికే వచ్చినట్లైంది. మిగతా షూటింగ్ చేయడానికి కొత్తగా డబ్బు కావాలి. అది ఇస్తే షూటింగ్ చేసేస్తాను అంటారు శంకర్. చెప్పినంతగా ఇచ్చేశాం, ఇక ఇచ్చేది లేదు.. సినిమాను కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మీదే అంటారు నిర్మాతలు. మరి ఈ సమస్య ఎలా పరిష్కారానికి వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :