టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సీరియస్ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రంగా వచ్చిన ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఏ నోబడి’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను రామ్ జగదీష్ డైరెక్ట్ చేయగా న్యాచురల్ స్టార్ నాని తన హోం బ్యానర్‌పై తీసుకొచ్చారు. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించారు. మంచి పాయింట్‌పై నడిచే ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఇక ఈ సినిమా ఏప్రిల్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇక్కడ కూడా కోర్ట్ చిత్రానికి ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. యూనివర్సల్ సబ్జెక్ట్ కావడం.. ఈ సినిమా ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉండటంతో ఈ మూవీకి సాలిడ్ రెస్పాన్స్ లభిస్తోంది. నాన్-ఇంగ్లీష్ చిత్రాల విభాగంలో నెట్‌ఫ్లిక్స్‌లో ‘కోర్ట్’ మూవీ గ్లోబల్‌గా 5వ స్థానంలో ట్రెండ్ అవుతుంది.
ఇలా ఓ తెలుగు సినిమా గ్లోబల్‌గా ట్రెండ్ అవుతుండటంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు విజయ్ బుల్గనిన్ సంగీతం అందించారు.