క్రేజీ బజ్ : చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత సూపర్ స్టార్, పవర్ స్టార్ ల బాక్సాఫీస్ క్లాష్ ?

Published on Mar 25, 2023 2:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుసగా సక్సెస్ లతో దూసుకెళ్తున్న విషయం తెల్సిందే. నిజానికి మెగాస్టార్ చిరంజీవి తరువాత టాలీవుడ్ లో టాప్ నెంబర్ వన్ హీరో ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఈ ఇద్దరి హీరోల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటాయి. దాదాపుగా ప్రతి ఏరియాలో భారీ స్థాయి మార్కెట్ కల్గిన ఈ ఇద్దరు స్టార్స్ కి కోట్లాదిమంది అభిమానాగణం ఉంది. ఇక వీరి నుండి మూవీస్ వస్తున్నాయి అంటే చాలు వారి వారి అభిమానుల్లో మాత్రమే కాదు అటు ఆడియన్స్ లో కూడా పెద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇక వీరిద్దరూ గతంలో పలు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తలపడ్డారు.

అయితే విషయం ఏమిటంటే, రానున్న 2024 సంక్రాంతి సందర్భంగా మరొక్కసారి ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్లాష్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ నటిస్తున్న వినోదయ సిత్తం రీమేక్ మూవీ 2023 జులై 28న రిలీజ్ కానున్నట్లు ప్రకటన వచ్చింది. మరోవైపు భారీ పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు మూవీ షూట్ లో కూడా మధ్యలో పాల్గొంటున్నారు పవన్. అలానే వీటితో పాటు హరీష్ శంకర్ తో ఆయన చేయనున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాగా వీటిలో ఒక మూవీ తప్పకుండా సంక్రాంతి బెర్త్ ని ఖాయం చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్.

అలానే మరోవైపు సూపర్ స్టార్ మహేష్ తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న SSMB 28 మూవీ ఆగష్టు 11న రిలీజ్ చేయన్నట్లు ఇటీవల నిర్మాత నాగవంశీ ప్రకటించినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ మూవీ ఇప్పట్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. దానితో ఈ మూవీని కూడా పక్కాగా సంక్రాంతి 2024 బరిలో నిలపాలని ఆలోచన చేస్తోందట యూనిట్. మరి అదే కనుక జరిగితే పక్కాగా సూపర్ స్టార్, పవర్ స్టార్ సినిమాల మధ్య 2024 పొంగల్ బాక్సాఫీస్ క్లాష్ తప్పదని అంటున్నాయి సినీ వర్గాలు. మరి వీరిద్దరి సినిమాల విషయంలో ఏమి జరుగుతుందో తెలియాలి అంటే వాటి రిలీజ్ లకు సంబంధించి ఆయా యూనిట్స్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :