హీరో ఆది సాయికుమార్‌ ‘క్రేజీ ఫెలో’ ఫస్ట్ లుక్ వచ్చేసిందిగా..!

హీరో ఆది సాయికుమార్‌ ‘క్రేజీ ఫెలో’ ఫస్ట్ లుక్ వచ్చేసిందిగా..!

Published on May 20, 2022 1:05 AM IST

హీరో ఆది సాయికుమార్‌ నటిస్తున్న తాజా చిత్రం “క్రేజీ ఫెలో”. ఫణికృష్ణ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ఆదికి జోడీగా దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స‌త్య‌సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కెకె రాధామోహ‌న్ నిర్మిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తుండగా, సతీష్‌ ముత్యాల సినిమాటోగ్రఫర్‪గా పని చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో ఆది కూల్‌ లుక్‌లో కనిపిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు